AP: ఎన్టీఆర్ పేరు చెప్పుకొని కొందరు ఆయన ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను ధ్వంసం చేస్తున్నారని వైసీపీ మహిళ నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ పార్టీని తీసుకుని ప్రజలకు ఏం చేస్తున్నారని ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. ఎన్టీఆర్ ఆశయాలను ధ్వంసం చేసేవారు బతికున్నా చనిపోయినవారితో సమానమని, అలాంటివారు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా ప్రయోజనం ఉండదని లక్ష్మీపార్వతి అన్నారు.