AP: రాష్ట్రంలో ఇంత దారుణమైన పాలన ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్ కడపలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు, లోకేశ్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతూ రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు’ అని అన్నారు.