కూటమి పాలనపై ప్రజల నమ్మకం: పవన్

AP: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈవీఎంలతో జరిగిన సార్వత్రిక ఎన్నికలైనా, బ్యాలెట్ ద్వారా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలైనా ప్రజలు కూటమి వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ విధానాలపై, పాలనపై ప్రజలు చూపిస్తున్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని పవన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఓటమిని ఈవీఎంలను నిందించిన పార్టీలకు, బ్యాలెట్ ఎన్నికల ఫలితాలు సరైన సమాధానమని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕