లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: అచ్చెన్న

AP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివరాల కోసం 08942 240557 నంబర్‌లో సంప్రదించాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕