ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉందని సూచించారు. లిక్కర్, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, వాళ్లు చేసిన తప్పుల్ని మనం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీని నమ్ముకున్న కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని, వారికి న్యాయం చేస్తామని అన్నారు. ఎన్డీఏ పక్షాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.