AP: తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖలతో కలిసి నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు.