AP: కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో హామీలతో కాలయాపన చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఒకే ప్రాజెక్టుకు పదేపదే శంకుస్థాపనలు చేయడం మానేసి పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో భూకేటాయింపులు, అనుమతులు పూర్తి చేసి జిందాల్తో పనులు ప్రారంభించామని, ప్రభుత్వం మారిన తర్వాత ఆటంకాలు సృష్టించారని ఆయన ఆరోపించారు.