బీసీ రిజర్వేషన్లపై పిటిషన్.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕