మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పిటిషన్.. KA పాల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం

ఏపీలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై దాఖలైన కేఏ పాల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం, ఈ విషయంలో ముందుగా హైకోర్టును ఆశ్రయించాల‌ని పిటిషనర్‌కు సూచించింది. ప్రజా ప్రయోజనం పేరుతో మీడియా ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం తగదని సుప్రీంకోర్టు కేఏ పాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెడికల్‌ విద్యకు సంబంధించిన వ్యవహారాలు రాష్ట్ర పరిధిలోనే ఉంటాయని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

సంబంధిత పోస్ట్