AP: పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. రొంపిచర్ల మండలం విప్పర్లలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వేళ టీడీపీకి చెందిన ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. నామినేషన్ వేసేందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థిని టీడీపీలోని మరో వర్గం నేతలు అడ్డుకున్నారు. దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పెట్రోల్ బాంబులు, కర్రలు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.