నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడటం వల్ల దాని నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతి మెదడుపై డిజిటల్ ఒత్తిడిని సృష్టిస్తాయి. దీంతో ఏకాగ్రత సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా ఆందోళన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల స్థాయి పెరగవచ్చు. దీని ప్రభావంతో గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఉదయం కనీసం 30 నిమిషాల పాటు ఫోన్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.