AP: జిల్లా స్థాయిలో ప్రణాళికలను రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ శాఖల పనితీరుపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం గత రెండు త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, 17.11 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. GSDP సాధనలో ప్రణాళిక అత్యంత కీలకమని, గత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో చివరి స్థానానికి చేరిందని చంద్రబాబు పేర్కొన్నారు.