AP: ప్లాస్టిక్ వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సచివాలయంలో జులై 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలులోకి వస్తుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ నిషేధాన్ని దశలవారీగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, నగరాలలో అమలు చేస్తామని పేర్కొన్నారు.