రాజధాని రైతులు కోరినట్లే ప్లాట్లు: నారాయణ

AP: పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపుపై చర్చించారు. దీనిపై రైతులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేశారు. రైతులు కోరినట్లే ప్లాట్ల కేటాయింపు ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్