పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: సజ్జల

AP: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని జైలులో పరామర్శించిన అనంతరం, ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బ్యాలెట్ బాక్స్ తరలింపును అడ్డుకున్న అప్పిరెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేసి పది రోజులుగా నిర్బంధించారని ఆయన ఆరోపించారు. పోలీసులు కిరాయి సైన్యంలా టీడీపీ కార్యకర్తల కోసం పనిచేస్తున్నారని సజ్జల విమర్శించారు. పోలీసుల అండతో ఎన్నికల్లో గెలిచి టీడీపీ నేతలు గర్వపడుతున్నారని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్

✕
✕