AP: పల్నాడు జిల్లా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న వేళ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రస్తుతం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.