AP: విజయవాడ మహానగరంలో పోలీసు శాఖకు ఏమైందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సాయికృష్ణను లాకప్‌డెత్ చేసి హైకోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. శనివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే సీపీ రాజశేఖర్ బాబు ఏం చేస్తున్నట్టు? చంద్రబాబు పాలనలో కొందరు పోలీసులు దిగజారిపోయారు. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులాగే లిక్కర్ కేసును కూడా సీరియల్‌గా నడిపిస్తున్నారు’ అని అన్నారు.