AP: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. శుక్రవారం ఆయన పర్యటన దృష్ట్యా పోలీసులు ఆంక్షలు విధించారు. తాడేపల్లి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకు జగన్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, రూట్ మ్యాప్ మార్చాలని పేర్కొంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.