AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మురసు తుఫాన్ అల్లకల్లోం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, వరదలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. గుంటూరు-పర్చూరు ప్రధాన రహదారి చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద వాగులు ఉప్పొంగి వరద ముంచెత్తింది. దాంతో వరద నీటిలో పోలీస్ జీపు ఇరుక్కుపోగా.. అధికారులు ఇతర వాహన సాయంతో దాన్ని సురక్షితంగా బయటకు తీశారు.