త్వరలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ: హోం మంత్రి అనిత

పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారికి హోం మంత్రి అనిత శుభవార్త చెప్పారు. 'త్వరలోనే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది పోలీసులు కొరత ఉంది. గత ప్రభుత్వం ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు. ఎన్నికలకు ముందు నియామకాల పేరుతో స్టంట్ చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసులకు సౌకర్యాల కల్పించి వారిపై ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకుంటాం' అని ఆమె వెల్లడించారు.

సంబంధిత పోస్ట్