AP: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గంలోని అబ్బూరులో నాగార్జున యాదవ్ నివాసానికి వచ్చిన తిమ్మాపురం పోలీసులు, ఏడు రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు విడుదలైన నిధులపై వినియోగంపై ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.