రౌడీషీటర్లకు పోలీసుల వినూత్న కౌన్సెలింగ్.. చెప్పుల్లేకుండా నడిపించి హెచ్చరిక

AP: గుంటూరు పోలీసులు జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న సుమారు వందమంది రౌడీషీటర్లకు వినూత్నంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిని పోలీసు డార్మెటరీకి తరలించి, శిక్షణ పొందిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం, వారిని నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియం కూడలి వరకు చెప్పుల్లేకుండా నడిపించారు. పోలీస్‌స్టేషన్లకు తరలించి, మంచిమార్గంలో నడవాలని సూచించి పంపించారు. రౌడీషీటర్లు పద్ధతి మార్చుకోకపోతే పీడీ చట్టం అమలు చేస్తామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్