ఏపీలో మరో దారుణం జరిగింది. నెల్లూరు జిల్లా గూడూరులో పోలీస్‌పై ఓ వ్యక్తి కర్రతో దాడి చేశాడు. సాధుపేట సర్కిల్ వద్ద కానిస్టేబుల్ స్వామిదాస్‌పై ఓ వ్యక్తి కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు లల్తూ కలిండి పోలీస్ యూనిఫాం చూస్తే సైకోలా మారిపోతాడని స్థానికులు చెబుతున్నారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.