కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.. మంత్రి లోకేశ్ వార్నింగ్(వీడియో)

AP: టంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద మంత్రి నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను గమనించిన లోకేశ్‌ స్వయంగా జోక్యం చేసుకుని సింగరాయకొండ సీఐ హాజరత్తయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలను అడ్డుకోవద్దని స్పష్టంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మారిటైమ్‌ బోర్డు ఛైర్మన్‌ దామచర్ల సత్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్