AP: బీసీల రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు ఇకనైనా రాజకీయ డ్రామాలు ఆపాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘34 శాతం రిజర్వేషన్ల జీవోలు కోర్టుల్లో నిలబడవని తెలిసి.. బీసీలను మోసం చేయడానికి తీసుకొచ్చారు. వాటిని హైకోర్టు రద్దు చేసింది. దాంతో సుప్రీంకోర్టుకి వెళ్తామంటూ బుకాయిస్తున్నారు. ఇకనైనా ఈ మోసాలు మాని బీసీ రిజర్వేషన్లపై చట్టపరమైన శాశ్వత పరిష్కారం చూపాలి’ అని అన్నారు.