మాజీ సీఎం జగన్ అడ్డాగా భావించే పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇప్పటికే వైసీపీ తరఫున ఉమాదేవి, హేమంత్ నామినేషన్ వేయగా.. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతా రెడ్డి, తమ్ముడు భరత్‌రెడ్డి ఇవాళ నామినేషన్ వేశారు. పులివెందుల జడ్పీటీసీ తుమ్మల మహేశ్వర్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. స్థానిక ఎన్నిక కావడంతో ఎవరికి వారు విజయావకాశాలపై ధీమాగా ఉన్నారు.