AP: రాజకీయ నేతలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక సూచనలు చేశారు. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం రాజకీయ నేతలు నేర్చుకోవాలని సూచించారు. జై ఆంధ్ర ఉద్యమం నాడే రాష్ట్ర విభజన జరిగి ఉంటే ఇవాళ ఏపీ ఎక్కడో ఉండేదన్నారు. విభజన అనివార్యం అని తెలిసిందని, తాను ఏదో రకంగా విభజన అడ్డుకుంటానని అందరూ అనుకున్నారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు తన వద్దకు వచ్చి మాట్లాడారని, పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పానని అన్నారు.