AP: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన, అక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో దశలో 1,170 మంది సర్పంచులు, 19,655 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు.