AP: రాష్ట్రంలో మిగిలిపోయిన నాలుగు కార్పొరేషన్లకు గురువారం పోలింగ్ జరగనుంది. రేపు కాకినాడ, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహించనున్నారు. 4 కార్పొరేషన్లలో మేయర్ పదవుల కోసం 36 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 257 కార్పొరేటర్ స్థానాలకు 911 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ పదవుల కోసం 134 మంది అభ్యర్థులు, 707 వార్డుల కోసం 2,057 మంది పోటీ పడుతున్నారు.