బ్యాలెట్‌ బాక్స్‌ తెరుచుకోవడంతో నిలిచిన పోలింగ్‌

AP: అన్నమయ్య జిల్లా లక్ష్మీరెడ్డిగారిపల్లెలో బ్యాలెట్‌ బాక్స్‌ తెరుచుకోవడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. దీంతో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసులు, సిబ్బంది కలిసి బ్యాలెట్‌ బాక్స్‌ను ఓ గదిలో ఉంచి తాళాలు వేశారు. ఓటు వేసేందుకు పలువురు ఓటర్లు ఎదురుచూస్తుండగా, పోలింగ్‌ను తిరిగి కొనసాగించాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఎన్నికల సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕