అనంతపురం 45వ డివిజన్‌లో మళ్లీ ప్రారంభమైన పోలింగ్‌

AP: అనంతపురం 45వ డివిజన్‌లో నిలిచిపోయిన పోలింగ్‌ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. ఆర్వో పల్లవి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఓటింగ్‌ పునఃప్రారంభమైంది. ఓటర్‌ స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరిశీలించాలని ఆర్వో ఆదేశించారు. అంతకుముందు పోలింగ్‌ బూత్‌లోనే వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య పరస్పర దాడులు జరగడంతో పోలింగ్‌ సామగ్రి, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. దీంతో కొద్దిసేపు ఓటింగ్‌ నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕