AP: విజయవాడ నగరపాలక సంస్థ 55వ డివిజన్లో పోలింగ్ సమయాన్ని అధికారులు పెంచారు. గుర్తులు తారుమారవడంతో ఆ బూత్‌లో పోలింగ్ ఆలస్యమైంది. దాంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనంగా రెండున్నర గంటల సమయం ఇచ్చింది. కాగా, రాష్ట్రంలోని 92 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ ముగిసింది. ఎల్లుండి ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.