ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 30.50 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా కడప జిల్లాలో 36.35 శాతం, అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 23.89 శాతం పోలింగ్ నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగియగా, మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.