AP: రాజమహేంద్రవరం, కాకినాడ, శ్రీకాకుళం, మంగళగిరి-తాడేపల్లి అనే నాలుగు కార్పొరేషన్లలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి కాకినాడ నగరపాలక సంస్థలో 50.43 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే సమయంలో తణుకు పురపాలికలో 57.55 శాతం, కందుకూరు పురపాలికలో 68.89 శాతం, పొదిలి నగర పంచాయతీలో 68.45 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి.