AP: విశాఖపట్నంలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణిస్తోంది. 'రిస్పిరర్ లివింగ్ సైన్సెస్' నివేదిక ప్రకారం విశాఖ ప్రజలు దాదాపు ప్రతి 10 రోజుల్లో 7 రోజులు కలుషితమైన గాలినే పీలుస్తున్నారు. 2026 జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో 70.68 శాతం రోజుల్లో PM10 స్థాయులు భారత జాతీయ భద్రతా పరిమితిని మించిపోయాయి. గత రెండేళ్లలో నైట్రోజన్ డైఆక్సైడ్ (NO2) స్థాయిలు 34 శాతం పెరిగాయి. పరిశ్రమల ఉద్గారాలు, వాహనాల పొగ దీనికి ప్రధాన కారణాలు. రాష్ట్రవ్యాప్తంగా కూడా PM10 సగటు 2024లో 67 µg/m³ నుంచి 2026 నాటికి 84 µg/m³కు పెరిగింది. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.