AP: పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై పీటీ వారెంట్ ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేటకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం పోసానిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కోరనున్నట్లు సమాచారం. కాగా, పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 15 కేసులు నమోదయ్యాయి.