దుర్భర పరిస్థితిలో పొట్టి శ్రీరాములు ప్రాణాలు వదిలారు: చంద్రబాబు

AP: తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు పోరాటం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన మాట్లాడుతూ.. ‘58 రోజుల కఠిన నిరాహార దీక్షతో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షను అందరూ ఆషామాషీగా కొట్టిపారేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి అత్యంత దుర్భర పరిస్థితిలో ప్రాణాలు వదిలారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా 1952 డిసెంబర్ 19న ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్