పేదరికం వల్ల చదువుకోలేని పరిస్థితి రాకూడదు: సీఎం చంద్రబాబు

AP: పేదరికం వల్ల చదువుకోలేని పరిస్థితి రాకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. అండగా ఎవరూ లేక ఎంతో మంది యువత కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా హంద్రీనీవాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. "సమాజాన్ని ఆసరా చేసుకొని బాగుపడినవారు ఆలోచించాలి. పేదవాళ్లను పైకి తీసుకొచ్చేందుకు చేయూత ఇవ్వాలి. కింద స్థాయిలో ఉన్న 20% మందికి అండగా ఉందాం. అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేద్దాం’’ అని సీఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్