ముండ్లమూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలోని శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో మంగళవారం దొంగలు పడ్డారు. ఇద్దరు యువకులు గుడిలోని గంటలను దొంగలించుతున్న సమయంలో గ్రామ ప్రజలు గమనించి ఒక దొంగను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్సై కమలాకర్ దొంగను అదుపులోకి తీసుకున్నారు. మరో దొంగ పొలాల వెంట గంటలను తీసుకొని పారిపోయినట్లుగా స్థానికులు తెలిపారు.