దర్శి నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం వైసీపీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సమయంలో కోట్లు ఇస్తామని ఎన్నో ప్రలోభాలు పెట్టారన్నారు. అయినప్పటికీ ప్రలోభాలకు లొంగకుండా గెలిచి బయటకు వచ్చామన్నారు. ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపులో కార్యకర్తల కృషి ఎనలేనిదని ఆమె అన్నారు.