తాళ్లూరు మండలంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పది నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. తాళ్లూరు, విఠలాపురం, కొత్తపాలెం, ముండ్లమూరు మండలం పసుపగళ్లు గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు పరుగులు తీశారు. ఇలా ఒకేరోజు మూడుసార్లు భూకంపం రావటం, మూడు రోజుల నుండి రోజు భూమి కంపించడం గమనార్హం.