ముండ్లమూరు మండలంలోని పసుపు గల్లులో వరిగడ్డి వామి అగ్నికి ఆహుతయింది. ఆ గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి ఆరు ఎకరాల్లో వరిగడ్డి వామి వేసుకున్నాడు. ప్రమాదవశాత్తు మంగళవారం రాత్రి అగ్నికి ఆహుతి అయింది. సుమారు రూ. 2 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. దర్శి నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు.