ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలు

ప్రకాశం జిల్లా దర్శి మండలం బట్టువారి పల్లి గ్రామ సమీపంలో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్