దర్శిలో అమానుషమైన ఘటన

దర్శి మండలంలో గురువారం అమానుషమైన ఘటన చోటు చేసుకున్నది. దర్శి మండలంలోని వెంకటాచలంపల్లి కొండ సమీపంలో గుడి వద్ద ఏడు నెలల పసికందుతో కలిసి నిద్రించడానికి ఓ మహిళ వచ్చింది. కాగా ఆ మహిళ ఆ బిడ్డను మూటగట్టి ముళ్ళ పొదలలో వదిలేసి వెళ్లిపోయింది. దీంతో 7 నెలల పసికందు ఊపిరాడక మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్