వేసవి సెలవులలో విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని దొనకొండ ఎస్ఐ త్యాగరాజు అన్నారు. ఇటీవల పలు చోట్ల పిల్లలు ఈత కోసం వెళ్లి మృతి చెందిన ఘటనలు జరిగాయని శనివారం గుర్తు చేశారు. పిల్లలు చెరువులు, నీటి కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.