దర్శి మండలంలోని పోతవరం గ్రామ రైతుల పొలాల్లో బోరులలో అమర్చిన నాలుగు నీటి మోటర్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుల్లో ఒకరైన తిరుమల సుబ్బారావు మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. సుమారు రూ. 80 వేల నుంచి రూ. లక్ష విలువైన మోటర్లు అపహరణకు గురయ్యాయని బాధితుడు వాపోయాడు ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యాలని బాధితుడు కోరారు.