రాచర్ల ఎస్సై కోటేశ్వరరావుకు రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాపాయం తప్పింది. బుధవారం రాచర్ల నుంచి మార్కాపురం కు క్రైమ్ మీటింగ్ కు వెళ్లిన రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు తిరిగి పోలీస్ జీప్ లో రాచర్లకు వస్తుండగా మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై మినీ లారీ జీపును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాచర్ల ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది.