కంభం ప్రధానోపాధ్యాయుడికి అరుదైన గౌరవం

ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన కంభం మండలంలోని ఎన్‌ఆర్‌ తురిమెళ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్‌ నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల సంఖ్యను పెంచడం, పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయనను అభినందించారు. శుక్రవారం పొదిలిలోని బాలాజీ కళ్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్‌ డైరెక్టర్‌ సుబ్బారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సామా సుబ్బారావు చేతుల మీదుగా భాస్కర్‌ నాయుడుకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕