మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలోని లక్ష్మీపురం, మాగుటూరు గ్రామాలలో సోమవారం స్థానిక ప్రజలు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నిర్వాసితులకు పరిహారం అందించారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.