అర్ధవీడులోని మాగుటూరులో ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి గురువారం పర్యటించారు. గ్రామంలో మద్యం బెల్టు షాపు కొరకు బహిరంగ వేలంపాట నిర్వహించడంపై దర్యాప్తు చేపట్టారు. వేలంపాట నిర్వహించిన వ్యక్తి ఇంటిని సోదాలు చేశారు. అనంతరం వేలంపాట నిర్వహించిన వ్యక్తిని ఎమ్మార్వో వద్ద బైండోవర్ చేసి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా సీఐ తెలిపారు. మొత్తం 20 మందిపై ఇప్పటివరకు బైండోవర్ కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.